Saturday, November 21, 2015

My Dear Friend

My Dear Friend
I am not treacherous



Author: Sekhar Reddy Vasa




Forward


                Everyone who believes in existence of God follows some kind of doctrine. Why? It is because they want to live peacefully and also to reach heaven. For this they follow the doctrine and try to live virtuous life. There are so many different doctrines in this world. Identifying a good doctrine is hard; it is only known to the person who is following the doctrine or to the one who prays to God the almighty that created this world to show him the doctrine he needs to follow. If someone finds a good doctrine which definitely takes him to heaven and he is enjoying, shouldn’t he inform his beloved about this new doctrine or not? The person who doesn’t share this happiness with his friends is treacherous one.
                                                                                Your friend who doesn’t want to be treacherous,            
Sekhar Reddy Vasa                                        

 

















Story of two friends



            There were two best friends named Edward and Jerry living in a small town.

            One day, Edward came across a sage who was exhausted due to his tiresome journey. He took pity on that saint and took him home, fed him and did services. The saint admired Edward, his wife and his children for the services they had rendered and had preached him one axiom, a doctrine that was quite exquisite. He had told him that whoever had followed that doctrine would certainly acquire the place in Heaven, in the same way; he also told him that they would live peacefully there upon. Not just that, he had also told him that to whomever Edward would teach this doctrine, all those would have the access to the Heaven.

                Edward decided that he should not only follow it but also preach such great doctrine to his best friend Jerry. But he knew that Jerry was content to follow the doctrine of his ancestors. Because Edward knew this, he hesitated to share the new doctrine that he was following. But Jerry was his best friend; he had an ambition that Jerry also would come along with him to the Heaven. Even Jerry also had known that Edward has been following a new doctrine. Jerry hesitated to ask Edward about the new doctrine he was following because he feared that Edward would feel bad. And so, he never enquired about it. While they both kept silent, time was passing.

                Both Edward and Jerry died and their spirits stood in front of God for judgment. God called Edward, “You are treacherous friend because you didn't even try to reveal to your best friend that would lead him to the Heaven, an access to the Heaven, at least once. You should have told him about the doctrine you have been following. So, as you are a treacherous friend, you just deserve the Hell.”

                In the same way, God told to Jerry, “You have complete knowledge that Edward had been following one new doctrine! But you had never questioned him about it or enquired to find if it was good or bad. He is your best friend and you never wished to find whether he had chosen the right doctrine or not and you never felt that you should correct him if he were wrong. So, even you are a treacherous friend. So you too deserve Hell!” Saying so, God had sent both of them into the Hell. Both these friends, scolding each other, have been suffering in Hell ever since then!

-----------------End of Story of two friends -----------------

                Dear friend, is it possible that a silence has spread over the two of us, just like between the two friends in the story? You are not asking me about my faith, and I have not had the courage to tell you. If I don't share my faith, my God will not be pleased with me. My dear friend, do you like anything as such to happen to me? If not, you listen to what I say about the doctrine that I have been following at least once, and relieve me from my responsibility. I would never urge you to follow my doctrine because, that is related to you and God. In the same way, you preach me about the doctrine you have been following. In this way, let both of us relieve ourselves from our collateral responsibilities.

                We should spend hundreds of hours sharing our life stories. I won’t ask that of you. But I would like to briefly share my faith with you, if you would be kind enough to read on… 



Story of a Prince



                Once upon a time, there was a king who had a son who was the apple of his eye. The king also loved his citizens. The king and the prince looked after the people as their own children.

                As there were no sins, in his kingdom, there was peace and harmony in the kingdom. But eventually, sin entered into the kingdom due to sly plotting by enemy kingdoms. The people had got habituated to do sins. There were theft, fornication, murders and violence etc. The king had understood that the peace and harmony had diminished. So he had decided to imprison all those who had committed sins and decided to punish them. At the time of the implementation of the punishments, the sinners used to beg for pardon.

                The king used to take pity at their piteous situation. He used to show pity on them, instead of punishing or imprisoning, he used to warn them and commanding them not to repeat the sins; he used to pardon them and release them. Though there was no change in the situation, they never stopped committing crimes. The citizens used to commit sins and used to ask the king for forgiveness, this had become their habit. In such critical and complex situation, the king had decided that he shouldn't bestow them forgiveness freely and there should be some penalty they have to bear as a sort of punishment and for this a penance and atonement is introduced. 

            Even these punishments couldn't bring any sort of change in the situation and the citizens didn't stop committing sins. For that reason, the king gave them further severe punishments. One of the punishments is that the sinner must offer one of his animals which are the source of his livelihood. Due to this reason, some people were scared and had stopped committing sins. The reason was, wasn't it difficult for them to part from the animals which were the source of their livelihood and which they had brought up with extreme love and care, wasn't it? 

But most of them continued committing their sins. Don't the rich have numerous animals? It had become quite common thing to sacrifice those animals. It had become a natural part of their life.

In this bad situation, the king sent his ministers to the people to preach to them to not commit sin. Some people had changed after they had heard their words. But some people had no change in their behavior used to attack the ministers and murder them. The king was outrageous at this. With that rage, he could have killed them but by seeing some people, who had changed, he showed mercy upon them due to the love he had for them, he had pardoned them. He had sentenced only those who had committed terrible and dreadful crimes alone to death. The king was not willing to punish his citizens. He desired that they would change. 

Because of his love for his citizens, the King sent his beloved son to them. The Prince had given up his authority and had lived among the citizens just like as if he was a part of them. As one among them he had been living without committing sins and had been teaching those good practices.

When they met the prince, most of the people repented from their ways. Some people had even transformed into his helpers with his preaching. The Prince had been touring in the kingdom along with them, he used to teach good path and the love his father had for the citizens. The main points of his preaching were:

* You must love your God with your whole heart, mind, and spirit.
* You must love your neighbor as yourself. You must forgive each other instead of seeking revenge.

If you all follow these willfully and wholeheartedly, you would never commit any sin. One whoever is, by loving God willfully and considering his neighbors as himself, won't he look after his own mother and father well? Does he steal? Does he adulterate or fornicate? Can he murder any one? Can he speak false witnesses?

Now let us consider one parable, the Prince had given here.

 "A slave owed a lot of money to a master and he was brought to the master. As he did not have anything to repay his loan, the master had ordered him to sell his wife, his children and his entire property and repay his loan. So, that slave lay prostrate before him and appealed to give him some more time and told him that he would repay the whole sum. When he had appealed the master so, he took pity on the slave and had forgiven him and had acquitted him, and also had written down the loan. But that slave, as soon as he went out, he held the throat of another slave who was in debt to him some small amount. For that the other slave lay prostrate before him and had requested him to give him some more period of time and had appealed him that he would repay soon entirely, but that slave didn't agree and he had him imprisoned until his loan is repaid.
 By seeing this, his co-slaves grieved to great extent, they all immediately approached their master and informed him about this in detail. The master immediately summoned him calling him, "You the wicked! You had appealed to me and I had taken pity on you and had forgiven you and had got your entire loan written off. Exactly, as I had forgiven you, you too could have forgiven your co-slave, couldn't you? Thus saying, he had got him thrown into prison.”

            Among yourselves too, if each and every one wouldn't forgive your brother whole heartedly, my father also would repay the same to you too, thus the Prince had given parable.  

            With his preaching’s he informed them that love of his father is great, and the father would forgive them all if they had acquired the repentance and change of heart.

He told them another story about his father’s love.

"There was a man who had two sons. The younger one said to his father, 'Father, give me my share of the estate.' So he divided his property between them. "Not long after that, the younger son got together all he had, set off for a distant country and there squandered his wealth in wild living. After he had spent everything, there was a severe famine in that whole country, and he began to be in need. So he went and hired himself out to a citizen of that country, who sent him to his fields to feed pigs. He longed to fill his stomach with the pods that the pigs were eating, but no one gave him anything. "When he came to his senses, he said, 'How many of my father's hired servants have food to spare, and here I am starving to death! I will set out and go back to my father and say to him: Father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son; make me like one of your hired servants.' So he got up and went to his father. "But while he was still a long way off, his father saw him and was filled with compassion for him; he ran to his son, threw his arms around him and kissed him.  "The son said to him, 'Father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son.' "But the father said to his servants, 'Quick! Bring the best robe and put it on him. Put a ring on his finger and sandals on his feet. Bring the fattened calf and kill it. Let's have a feast and celebrate. For this son of mine was dead and is alive again; he was lost and is found.'"

In the same way when a sinner acquires the change of heart and repentance, the father also would be happy. By giving such numerous parables, he had appealed them to have repentance.

But, some people who couldn't stand his preaching had subjected him to extreme acrimonious and cruel death. The King's heart trembled with sorrow when he saw his son in his death bed. The king, with sorrow and anger, decided to terminate all those sinners who were responsible for this situation of his son. His anger had shattered and trembled the whole earth.

But, the Prince who was in the death bed appealed to his father, "Father, they are ignorant of what they are doing, please forgive them. These words melted the hearts of those who heard them. One among the conspirators responsible for the death of the prince had started crying in this way, "Oh Lord! Though I had committed such a horrible crime against you, are you forgiving me? You have taken the punishment that I deserved! "You have taken the punishment that I deserved! This extreme love overwhelms me, and in gratitude I repent from my sins." In this way numerous sinners had got relieved from the sins due to the sacrifice of life of the Prince.

………………………………………..


Here the very important fact is that this is not a fiction! This is a real story! That king is none other than the Lord of the Lords, the creator God. We are all his beloved children. Any father wouldn't be happy, he would be sorrowful if his son falls into false path, in the same way the Lord of the Lords is sorrowful for his children who got deviated from the righteous path. The reason being Lord God had created man by keeping his Spirit in us. How he had expressed his love towards is:

* Alas, I had protected you just as how a hen protects its chicks under its wings! Though, you had forgotten.
*Would any father tell his children to eat a stone when they are hungry and asks for food? You those who are in sins also would love your children so much, do you know how much love I have for you?
The relationship between God and us human beings is just like the relationship between the father and his children.

Then, we have learnt that the king is the creator God, haven't we? Then who is his son? Now let us learn about him.

The word of the God is the Son of God. This God’s word created the universe. The God's word alone, as the Son of God, as an ordinary man took his birth in this world for our sake had sacrificed his life. So, the Prince mentioned is none other than the Son of God! In the sense, he is God himself! From here, let us consider the king mentioned in the story as the God himself and the Prince is the Son of God. Now, let us get into this real story.

The Son of God, in the form of a human being, he was tortured cruelly and remorselessly and was in his death bed. His mother who had borne him for nine months in her womb and had brought him up was weeping by seeing him dying. We can't even imagine how a mother would feel when her son is being tormented and killed in her presence, in front of her eyes. Heart would have agitated in turmoil; it felt as much sorrow as a huge spear is pierced into her heart. The Son of God had suffered the torment of death for a few hours and finally he had died. After his death, that poor mother had performed the last rites of the funeral with her own hands. This has put an end to the incarnation of the Son of God. "Isn't it quite common doubt to ask, "What God had been doing while such horror was going on?”  The reason is that, all this has happened according to his manifesto itself. He is not only saying that he has as much of love as he could sacrifice his life, but also did it and proved it.
As a human being, he had fulfilled the divine manifesto, and as triumphant he acquired resurrection and had reached his father in glory. God had given the entire authority to his son; he also told him that his son alone would give judgment. This is a delightful fact to the entire human race because as the Son of God had lived as a human being, he understands very well all the woes and troubles in living as a human being. Since, he is the judge, it is better for us to follow all that he had preached on this earth. Here in one parable he had given in this way.

"When the Son of Man comes in his glory, and all the angels with him, he will sit on his glorious throne. All the nations will be gathered before him, and he will separate the people one from another as a shepherd separates the sheep from the goats. He will put the sheep on his right and the goats on his left. "Then the King will say to those on his right, 'Come, you who are blessed by my Father; take your inheritance, the kingdom prepared for you since the creation of the world. For I was hungry and you gave me something to eat, I was thirsty and you gave me something to drink, I was a stranger and you invited me in, I needed clothes and you clothed me, I was sick and you looked after me, I was in prison and you came to visit me.' "Then the righteous will answer him, 'Lord, when did we see you hungry and feed you, or thirsty and give you something to drink? When did we see you a stranger and invite you in, or needing clothes and clothe you? When did we see you sick or in prison and go to visit you? "The King will reply, 'Truly I tell you, whatever you did for one of the least of these brothers and sisters of mine, you did for me.' "Then he will say to those on his left, 'Depart from me, you who are cursed, into the eternal fire prepared for the devil and his angels. For I was hungry and you gave me nothing to eat, I was thirsty and you gave me nothing to drink, I was a stranger and you did not invite me in, I needed clothes and you did not clothe me, I was sick and in prison and you did not look after me.' "They also will answer, 'Lord, when did we see you hungry or thirsty or a stranger or needing clothes or sick or in prison, and did not help you?' "He will reply, 'Truly I tell you, whatever you did not do for one of the least of these, you did not do for me.' "Then they will go away to eternal punishment, but the righteous to eternal life."

So it is far better for all of us to help fellow human being, anyone who is in need.

We have learnt that this universe is created by the word of God. When he had created this world, there wasn’t sin at all. Hitherto how did the sin enter into this world? Hitherto, what is sin at all?

God did not create human beings as robots. He had given human being the stamina to think for himself and take decisions but he had not given him the wisdom to distinguish between the Good and the Evil. Due to that reason, in the first human beings, there wasn’t sin at all as they did not know what is good and what is evil, and they were as innocent as infants. As there wasn’t any sin, they did not have even death. Henceforth, due to the instigation of a putrefied angel of God, acquired the power of distinguishing the Good and the Evil though the God reluctant to offer, as human had urged, God had sealed the inscriptions in our hearts which enabled us to distinguish the Good and the Evil. Due to these inscriptions, each and every man can distinguish what is good and what is bad if he thinks just a little. It is a quite well known fact that man is a fickle minded creature. If one does a deed with full consciousness that what he is doing is a wrong is sin. It is a true fact that there is no one who had not committed a sin. Due to that alone, man is bestowed with death. All of us are sinners. We all had committed small or big sins in our lives. All of us would die one day. And all of us would be made to stand in front of God for judgment. So before our death itself, we all must cleanse our sins. Because, the Son of God is busy in the task of creating new earth for us. Those who are in sins are deprived of entry into this new world. Then how can we get relieved of our sins? It is possible only through the Son of God alone. The reason is, he had taken the death sentence which we all deserved and also had appealed the Father God to forgive us for his sake. Due to this reason, it is just sufficient if we all acquire repentance, and accept the alms of forgiving that he offers. He would cleanse and wash off all our sins with the blood he had spilt on his death bed. He would emend us to make us eligible for acceptance of his Father, the God. However sinner is a person, he could acquire forgiving.

This is a free call of the Son of God to each and every human being in the world. There isn't any segregation in the name of color, caste, creed, religion, nationality the rich and the poor.
The Son of God is calling the human race in this way. “My dear children who had been shouldering the burden of sins with great endeavor, come to me and I will give you rest”.

So, all those who approach the Son of God listening to his call, would acquire forgiving of sins. The defilers named the sins would be cleansed off and their Spirit would acquire their earlier beauty.
Henceforth, the only thing we too have to do is "Just as God had forgiven us, we too must forgive each other freely without conditions. 

It is said by people that a man would consume even phenol when it is offered free of cost, isn't it? In such cases, we who are getting forgiveness of our sins free of cost must have anxiety in approaching him. This we need to consider seriously. Because, we don't know ourselves when our death would overtake us. We need to get forgiving for our sins before our death. The reason is the Son of God had fulfilled the oblation named the “Salvation to the world” on this earth itself when he was on his death bed, when he was born as a human being. So, we too must acquire this forgiveness of sins on this earth itself. 

If the sins of all are forgiven freely, what would be the difference between the Good and the Bad? Are all equal in the new creation? Isn't there any benefit in leading a good and pious life now? This question would surely torment us. So, let us learn a few more facts.

Is there anywhere anyone who had not committed a single sin at all? There wouldn't be even one who had not committed a single sin, speaking at least a lie; there wouldn't be anyone who had not committed a single sin. In the sense, each and every one requires forgiveness for sins. The Son of God would bestow this forgiving of sins to each and every one, those who would approach him. In the same way, each and every one would have performed a single virtuous deed at least. These virtuous deeds would be transformed into their golden crowns and they would be so glorified that their Spirit would be eligible to carry them even after their death. According to their virtuous deeds they had performed in the new creation God would bestow the gifts and remunerations that they deserve.

All this is fine but if we want to ask for forgiving of sins, where will be this Son of God? To which temple must we go to find him? Which mountain should we mount? Whom should we inquire? How should we find out? 

When the God had created us, he had established an abode for himself in our hearts. Our body alone is the God's temple. Due to our sins, we had distanced our God farther. The Son of God is eagerly waiting for us to open the doors of our hearts! He is the truth. He would surely show the path to those who are searching for the truth. He would recognize us himself. The words he spoke are like this, "You ask! It is bestowed to you. You search and it is found by you. You knock and the door would be opened for you. Each and every one who would ask would acquire, everyone who searches for truth would find, everyone who would knock would be opened the door and allowed entrance". So, all that we have to do is just prepare ourselves to search for the truth with courage. If you all put this small effort to find out truth as the below mentioned without fear, it is sufficient. "Oh Lord God who had created the entire universe, please let me know the truth. I am destined to know the true God. Please show me the path and please walk me to your presence. I offer and sacrifice my heart to you. Please make your abode yourself in me."

The almighty God will show you the way.


Thanks for your valuable time. Please do not hesitate to discuss with me.

Your friend forever,


నా ప్రియ మిత్రమా!







ముందుమాట





          దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు ఎదో ఒక మార్గాన్ని ఆచరిస్తుంటారు, ఎందుకు? ప్రశాంతమైన జీవితము కోసరము మరియు చివరకు చనిపోయిన తరువాత స్వర్గ ప్రాప్తి కోసరమే కదా! వీటి కోసరము మంచిగా జీవిస్తూ వారి ధర్మాన్ని పాటిస్తుంటారు. ఈ ప్రపంచములో అనేకమైనటువంటి మార్గములు వున్నాయి. వాటిలో మంచిది ఏది అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టము, దానిని ఆచరిస్తున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడినే నాకు సరైన మార్గమును చూపమని ప్రార్ధించిన వారికి ఆ నిజమైన మార్గము గురించి తెలుస్తుంది. ఇలా ఆ మంచి మార్గాన్ని కనుగొని ఆనందముగా జీవిస్తున్న వారు తమ మిత్రులకు దానిని గురించి తెలియ చెప్పక పోతే వారిని ఏమంటారు? వారిని మిత్రధ్రోహులనరా? ఇటువంటి మిత్రధ్రోహిగా ఎవ్వరూ కాకూడదనే నా ఈ చిన్న ప్రయత్నము.
                                      మిత్రధ్రోహిగా ముద్ర పడుట ఇష్టములేని మీ మిత్రుడు,
                                                                                      శేఖర్ రెడ్డి వాసా


ఇద్దరు స్నేహితుల కధ

        
ఒక ఊరిలో రాము మరియు శ్యాము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు వుండేవారు.  ఒక రోజు రాము,ప్రయాణము చేసి అలసిపోయిన ఒక మునిని చూసాడు.   ఆ మునిని తన ఇంటికి తీసుకు వెళ్ళిభోజనము పెట్టి సేవలు చేశాడు.  ఆ ముని,  రాము మరియు రాము యొక్క భార్య పిల్లలు చేసిన సేవను మెచ్చుకొని ఒక అధ్బుతమైన ధర్మమును నేర్పాడు.  ఆ ధర్మమును పాటించిన వారికి ఖచ్చితముగా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని, అలాగే వారు ప్రశాంతముగా జీవించగలరని చెప్పాడు.  అంతే కాకుండా రాము ఎవరికైతే ఈ ధర్మాన్ని నేర్పుతాడో వారందరికి కూడా స్వర్గ ప్రాప్తి కలుగునని చెప్పారు.  ఈ క్రొత్త ధర్మాన్ని పాటిస్తు రాముఅతని భార్య పిల్లలు అపారమైన ఆనందాన్ని పొందేవారు.
        ఇంత గొప్ప ధర్మము యొక్క మహిమను గురించి రాము తన ప్రాణ స్నేహితుడైన శ్యాముకు చెప్పవలెనని భావించాడు. కాకపోతే పూర్వీకులు పాటించిన ధర్మమే చాలనుకొనే శ్యాము గురించి తెలిసిన రాము తను పాటిస్తున్న క్రొత్త ధర్మాన్ని గురించి చెప్పడానికి సందేహించాడు. కానీ శ్యాము తన ప్రాణ స్నేహితుడుశ్యాము కూడా స్వర్గానికి తనతో రావాలని రాము ఆశ.  శ్యాముకి కూడా రాము ఒక క్రొత్త ధర్మాన్ని పాటిస్తున్నాడని తెలుసు,  ఎందుకు ఈ క్రొత్త ధర్మాన్ని పాటిస్తున్నవని అడిగితే రాము భాధ పడుతాడేమోనని శ్యాము రాముని ఎప్పుడు అడుగలేదు. ఈ సందిగ్ధావాస్థలో కాలము గడిచిపోయినది.  
రాము మరియు శ్యాము ఇద్దరు మరణించారు వారి ఆత్మలు దేవుని ముందు కడ తీర్పుకు నిలబడినవి. దేవుడు రాముతో  నీవు మిత్రధ్రోహివి! ఎందుకంటే నీ స్నేహితునికి స్వర్గ ప్రాప్తి పొందే ధర్మాన్ని చెప్పడానికి కనీస ప్రయత్నము కూడా చేయలేదు. ఒక్కమారైనా శ్యాముకి నీవు పాటిస్తున్న ధర్మము గురించి చెప్పవలసినది. కాబట్టిమిత్ర ధ్రోహివైన నీకు నరకమే సరైనది”. ఆలాగుననే శ్యాముతో దేవుడు ఇలాగున సెలవిచ్చాడు రాము ఒక ధర్మాన్ని పాటిస్తున్నాడని నీకు తెలుసు! కానీ నీవు ఏనాడూ అది ఏమిటని ఎప్పడూ అతనిని అడుగలేదు.  కనీసము అది మంచిదో కాదో తెలుసుకొను బాధ్యత నీవు ఎప్పుడును చూపెట్టలేదు,  నీ ప్రాణ స్నేహితుడైన రాము సరైన ధర్మాన్ని ఎంచుకొన్నాడో లేదో తెలుసుకొని అవసరమైతే సరిదిద్దాలన్నజ్నానము నీకు రాలేదు,  కాబట్టి నీవును మిత్ర ధ్రోహివే! కాబట్టి నీకు కూడా నరకము సరైనదే!” అని దేవుడు ఇద్దరని నరకములోకి పంపి వేశాడు. ఇద్దరు మిత్రులు ఒకరికి ఒకరు నిందించుకొంటు నరకములో మహా వేదన పడుతున్నారు!                        
                   ----------------కధ సమాప్తి--------------------------
ఈ కధ చదివిన ఓ ప్రియ మిత్రమా! మన ఇద్దరి మద్య కూడా ఈ కధలోని మిత్రుల మధ్య జరిగినట్లే నిశ్శబ్ధ వాతావరణము నెలకొన్నదని నీవు ఎప్పుడైనను గమనించితివానేను ఆచరిస్తున్న దర్మాన్ని గురించి నీవు అడుగుటలేదు. నాకు చెప్పడానికి ధైర్యము చాలడము లేదు. నేను నా ధర్మాన్ని గురించి నీకు తెలియ చేయక పోతే నా దేవుడు నన్ను మిత్ర ధ్రోహిగా పరిగణిస్తారే! నా మిత్రమా! ఇలా జరగడము నీకు ఇష్టమా?  కానప్పుడునేను పాటిస్తున్న నా ధర్మాన్ని గురించి ఒక్క సారి వినినా భాధ్యత నుండి నన్ను విడుదల చేయుము. నీవు నా ధర్మాన్ని అనుసరించమని నిన్ను నేను ఎప్పటికిని బలవంత పెట్టను. ఎందుకంటే అది నీకు దేవునికి మధ్య సంభంధము. అలాగే నీవు పాటిస్తున్న ధర్మము గురించి నాకును తెలియబరచుము. ఈ విధముగా మన ఇద్దరము మన పరస్పర భాధ్యత నుండి బయటపడగలము.
మన జీవితములో కొన్ని వందల గంటలు వార్తలు చదవడము వినడముతో మనము గడుపుచుంటాము. అంత సమయము నాకు అక్కర లేదు. నేనుపాటిస్తున్న ధర్మమును నేను ఒక కధ రూపములో వీలైనంత క్లుప్తముగా కొన్ని నిమిషములలోనే నీకు చెప్పెదను దయచేసి వినుము:

ఒక రాకుమారుడి కధ!

        ఒక రాజుకి ఒక కుమారుడు వుండే వాడు. రాజుకి తన కుమారుడు అంటే ప్రాణం. అలాగే తన ప్రజలన్న ప్రాణం. రాజు మరియు రాజ కుమారుడు ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునేవారు. అయన రాజ్యములో పాపము లేనందు వలన శాంతి సమాధానాలు ఉండేవి. కానీ శత్రు రాజ్యాల కుట్ర వలన పాపము ప్రవేశించింది. ప్రజలు పాపము చేయడానికి అలవాటు పడ్డారు. దొంగలించుటవ్యభిచారముచంపుట వంటి దురలవాట్లకి అలవాటు పడ్డారు. రాజ్యములో శాంతి సమాధానము కరువయ్యాయని రాజుకి అర్ధమైనది. పాపము చేసిన వారందరిని బంధించి వారిని శిక్షించాలని తలచారు. శిక్ష అమలు చేసే సమయానికి పాపులు రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేవారు. రాజుకి వారి పరిస్తితి చూసి జాలి మరియు బాధ కలిగేది. ఆయన వారిపై జాలి చూపి వాళ్ళని ఇకపై పాపము చేయవద్దని వదిలేసేవారు.
        కానీ పరిస్థితి మారలేదువారు మరల పాపము చేయడం ఆపలేదు. ప్రజలు పాపము చేసి రాజుని క్షమాపణ అడిగేవారుఅది వారికి అలవాటైపోయింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రాజు వారికి పాప క్షమాపణ ఊరికే ఇవ్వకుండా ప్రాయశ్చిత్తానికి ఏదో ఒక శిక్షని ఇవ్వడం మొదులుపెట్టారు. అవి ఎటువంటివి అంటే:
  • తల నీలాలు అర్పించుట.
  • పుణ్య నదిలో స్నానాలు ఆచరించుట.
  • గోనె సంచులు ధరించి ఉపవాసము ఉండుట.
        ఈ శిక్షలతో కూడా పరిస్థితి మారలేదు వారు మరల పాపము చేయడం ఆపలేదు. అందుకు రాజు మరింత కఠినమైన శిక్షని ఇవ్వడము మొదలుపెట్టారు. అది ఏమిటంటే పాపము చేసిన వాడు ప్రాయశ్చిత్తముగ తన జీవనాధారమైన పశువును బలిగా ఇమ్మన్నారు. దీనివల్ల కొంతమంది భయపడి పాపము చేయుట మానినారు. ఎందుకంటే వారికి జీవనాధారమైనఅతి ప్రేమతో పెంచుకొన్న పశువు లేకపోతే జీవించడము కష్టము కదా!
        కానీ అందరు పాపము చేయుట మానలేదు. ధనవంతుల దగ్గర చాలా పశువులు వున్నవి కదావారికి బలి అర్పించడము సాధారణమైన విషయము అయినది.
        ఇటువంటి పరిస్థితుల్లో రాజు తన మంత్రులను ప్రజల దగ్గరికి పంపి వారిచే పాపము చేయవద్దని బోధించేవారు. కొంతమంది వారి మాటవిని మారారు. కొంత మంది వారిపై దాడి చేసి హింసించి అంతటితో ఆగక వారిని చంపేసారు. రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో అయన పాపం చేసిన వారందరిని చంపేసేవాడే కానీ మారిన కొంతమందిని చూసి మరియు తనకున్న ప్రేమని బట్టి ఆయన వారిని చంపలేదు. భయంకరమైన నేరాలు చేసిన వారికి మాత్రమే మరణ శిక్ష విధించాడు.రాజుకి ప్రజలను శిక్షించుట ఇష్టము లేదువారు మారాలనే తన ఆశ.
        రాజు ప్రజలమీద తనకు ఉన్న ప్రేమతో చివరికి తన ప్రియమైన కుమారుని వారి దగ్గరకు పంపినారు. రాజ కుమారుడు తన అధికారాన్ని వదిలి ప్రజలలో కలసిపోయి వారిలో ఒకడిగా జీవించాడు. వారిలో ఒకడిగా పాపం చేయకుండా జీవిస్తూ వారికి మంచి పద్దతులు నేర్పే వాడు. ఆయనను చూసి చాలామంది మంచివారుగా మారారు. కొంతమంది అయన చేయు బోధనలో అయన సహాయకులుగా మారారు. వీరితో కలసి రాజ కుమారుడు తన రాజ్యములో పర్యటిస్తూ మంచి మార్గాన్ని మరియు తన తండ్రికి ప్రజలపై ఉన్న ప్రేమను బోధించాడు. అయన బోధనలోని ముఖ్యమైన విషయాలేమిటంటే:
  • పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుని ప్రేమింప వలెను.
  • నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఒకరికి ఒకరు క్షమించుకోవాలిపగ పట్ట రాదు.
        వీటిని మీరు మనస్పూర్తిగా ఆచరించిన మీరు ఏ పాపమూ చేయరు. ఎవరైనా దేవుని మనస్పూర్తిగా ప్రేమిస్తూ మరియు తన పొరుగువానిని తనలాగా చూచుకోనేవాడు తన తల్లినితండ్రిని మంచిగా చూచుకోరా?దొంగిలిస్తారావ్యభిచరిస్తారాహత్య చేస్తారా?అబద్ద సాక్ష్యములు పలకగలరా?
రాజ కుమారుడు చెప్పిన ఒక ఉపమానాన్ని మనము ఇప్పుడు చదువుకొందము:
        "ఒక యజమాని దగ్గర చాలా అప్పు వున్న ఒక దాసుడు అతనియొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందునవాని యజమానుడు వానినివాని భార్యనుపిల్లలనువాని ఆస్తిని అమ్మి,అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కికొంత కాలము గడువునియ్యుముమీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసునిపై యజమానుడు కనికర పడివానిని విడిచిపెట్టివాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు కొంచెమే అప్పుబడి వున్న తన తోడిదాసులలో ఒకనినిచూచివాని గొంతుపట్టుకొని చెల్లింపు మనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నాకు కొంత గడువునియ్యుమునీకు చెల్లించెదనని వానిని వేడు కొనెను గాని వాడు ఒప్పుకొనక తన అప్పు తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచిమిక్కిలి దుఃఖపడి,వచ్చి,  జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి దుర్మార్గుడా,  నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;  నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా! అని వానిని చెరసాలలో పడవేయించెను."
        మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయునని రాజ కుమారుడు ఈ చిన్న ఉపమానము ద్వారా చెప్పెను. తన బోధతో అయన అందరిని పాపమునుండి విముక్తులు కమ్మనితండ్రి ప్రేమ చాలా గొప్పదనిమారు మనస్సు పొంది మంచిగా జీవించేవారి పాపములు క్షమించబడునని చెప్పారు. మారు మనస్సు పొందిన వారిని తన తండ్రి శిక్షించడని వారికి మరియొక ఉపమానమును చెప్పాడు:
        "ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడుతండ్రీఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగాఅతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొనిదూర దేశమునకు ప్రయాణమై పోయిఅచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది,నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ! నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితినిఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానునన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొనిలేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడిపరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీనేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితినిఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టివీని చేతికి ఉంగరము పెట్టిపాదములకు చెప్పులు తొడిగించుడి;విందు సిద్ధము చేయుడిమనము తిని సంతోషపడుదముఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెనుతప్పిపోయి దొరకెనని చెప్పెను;"
        అలాగే నిజముగా మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై నా తండ్రికి సంతోషము కలుగునని చెప్పెను. రాజకుమారుడు ఇటువంటి బోధ్నలెన్నో ప్రజలకు నేర్పించి మారు మనస్సు పొందమని చెప్పెను.
        కానిఅయన మంచి బోధనను తట్టుకోలేని కొందరు ఆయనను క్రూరాతి క్రూరమైన మరణమునకు గురి చేసారుఆ మరణశయ్య మీదున్న తన కుమారుని చూసి రాజు హృదయము విలవిలలాడింది. రాజు బాధతో కోపముతో పాపత్ములంధరిని సంహరించాలనుకొన్నాడు. అయన కోపము భూమిని సైతం గడగడ లాడించింది.
        కానీమరణశయ్య మీదున్న రాజ కుమారుడు రాజుతో ఈ విధముగా వేడుకున్నాడు "తండ్రీ వీరు ఏమిచేయుచున్నారో వీరు ఎరుగరునన్ను చూసి వారిని క్షమించండి". ఈ మాటలు విన్న వారి హృదయాలు ధ్రవించాయి. రాజు కుమారుని మరణానికి కారణమయిన ఒకడు తన పాపములకు ప్రత్యాత్తాప పడుతూ ఈ విధముగా విలపించాడు "అయ్యో! నేను మీకు ఇంత ద్రోహము చేసినప్పటికీ నన్ను క్షమిస్తున్నావా! నాకు పడవలసిన శిక్షను నీవు తీసుకోన్నావే! ఇంత ప్రేమ నన్ను క్రుంగ తీస్తున్నది.". ఇలా ఎంతో మంది రాజ కుమారుని ప్రాణ త్యాగము వలన పాప విముక్తులు అయినారు.
        ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఇది కధ కాదు! ఇది నిజముగానే జరిగినది! ఆ రాజు ఎవరో కాదు మన సృష్టికర్తయైన దేవాధిదేవుడు. ఆయనకు మనమందరము ప్రియమైన బిడ్డలము. ఏ తండ్రైన తన బిడ్డలు చెడు దారి పడుతుంటే ఎలా బాధ పడుతారో అలాగే దేవాది దేవుడు తన దారి తప్పిన ప్రజలకోసం బాధపడుతున్నాడు. ఎందుకంటే మనిషిని సృష్టించి తన జీవాత్మను మనలో ఉంచాడు. ఆయన తన ప్రేమను ఏవిధముగా వ్యక్తము చేసాడంటే:
  • "అయ్యో! మిమ్మల్ని నేను కోడి తన రెక్కల క్రింద తన పిల్లలని కాపాడినట్లు మిమ్ములను నేను కాపాడానే! అయినా మీరు నన్ను మరిచితిరే!
  • మీలో ఏ తండ్రైన మీ పిల్లలు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే రాయిని తినమని చెపుతారా?పాపములో నున్న మీరే అంతగా మీ పిల్లలను ప్రేమిస్తుంటే నేను మిమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్ధముచేసుకోగలరా?"
తండ్రికి తన పిల్లలకి వున్న సంబంధం వంటిదే దేవునికి మనకు మధ్య వున్న సంబంధము.
        మరి రాజు మన సృష్టికర్తయైన దేవుడు అని తెలుసుకొన్నాము కదా! మరి రాజకుమారుడు ఎవరు?అయన గురించి ఇప్పుడు తెలుసుకొందాం.
        దేవుని యొక్క పలుకులకు రూపమే ధైవకుమారుడు. ఈ దేవుని పలుకు ద్వారానే ఈ సమస్త సృష్టి సృజించబడినది. దేవుని పలుకే ధైవకుమరునిగా మరియు సామాన్య మనిషిగా ఈ లోకంలో జన్మించి మనకోసరము ప్రాణ త్యాగము చేసినది. కాబట్టి రాజ కుమారుడు ఎవరో కాదు ధైవకుమారుడే! అంటే దేవుడే! ఇక్కడనుండి మనము రాజుని దేవుడని మరియు రాజ కుమారుని దేవుని కుమారుడని చదువుకొందము. ఇప్పుడు మనము ఈ నిజమైన కధలోకి వెళ్ళెదము ...
        దైవకుమారుడు మానవ రూపములో కౄరాతి క్కౄరముగా హింసించబడి మరణశయ్య మీదున్నాడు. ఈ ధైవకుమారుని మానవునిగా నవ మాసాలు కని పెంచిన తల్లి తన కుమారుని చూసి విలపిస్తున్నది. ఏ తల్లికైనా తన బిడ్డని తన కళ్ళ ఎదురుగా అలా హింసించి చంపుతుంటే ఎలా ఉంటుందో వుహించనలవి కానిది. ఆ తల్లి హృదయం తల్లడిల్లినదిఓ పెద్ద గునపము తన గుండెల్లో దిగినంత బాధ. దైవకుమారుడు కొన్ని గంటలపాటు మరణయాతన పడి చివరకు మరణించాడు. చనిపోయిన తన కుమారుని తన స్వహస్తాలతో అంత్యక్రియలు చేసినది ఆ తల్లి. దీనితో ధైవకుమారుని మానవ అవతారము సమాప్తి అయినది. "ఇంత ఘోరము జరుగుతుంటే ఆ దేవుడు ఎలా ఊరకే వున్నాడు" అను సంశయం కలగడము సహజమేగదా! ఎందుకంటే ఇది తన ప్రణాలిక ప్రకారము జరిగినది. మీకోసం నా ప్రాణాన్ని ఇవ్వగలిగినంత ప్రేమ వున్నదని చెప్పడమే కాదు! చేసి చూపించాడు!
మానవునిగా దేవుని ప్రణాళికను నెరవేర్చిన దైవ కుమారుడు విజయుడుగా పునరుత్థానుడై పరలోకములో నున్నతన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడు. దేవుడు తన కుమారునికి ఈ మానవాళి మీద సర్వాధికారాలు ఇచ్చారుతన కుమారుడే ఈ ప్రజలకు తీర్పు చేస్తారని చెప్పారు. ఇది మానవులకు ఆనందకరమైన విషయము ఎందుకంటే దైవకుమారుడు మానవుడుగా జీవించినందు వలన ఆయనకు మానవునిగా జీవించుటలో ఉన్న బాధలన్నీ బాగా తెలుసును. కాబట్టి ఆయన మనకు ఖచ్చితముగా న్యాయము చేయగలరు. మనము చనిపోయిన తర్వాత మనకు ఆయన తీర్పు చేస్తారుకాబట్టి మనము ఆయన ఈ భూమి మీద చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించడము మంచిది. ఆయన మనకు చెప్పిన ఒక ఉపమానము ఈ విధముగా వున్నది:
        "తన మహిమతో దైవ కుమారుడును ఆయనతో కూడ సమస్త దేవ దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురుగొల్లవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచితన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు దైవకుమారుడు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారారండిలోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటినిమీరు నాకు భోజనము పెట్టితిరిదప్పి గొంటినినాకు దాహమిచ్చితిరిపరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరిదిగంబరినై యుంటినినాకు బట్ట లిచ్చితిరి;రోగినైయుంటినినన్ను చూడవచ్చితిరిచెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులుప్రభువాయెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిునీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిుఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి?దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు?ఎప్పుడు రోగివై యుండుటయైననుచెరసాలలో ఉండుటయైనను,చూచినీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారానన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటినిమీరు నాకు భోజనము పెట్టలేదు;దప్పి గొంటినిమీరు నాకు దాహమియ్యలేదుపరదేశినై యుంటినిమీరు నన్ను చేర్చుకొనలేదుదిగంబరినై యుంటినిమీరు నాకు బట్టలియ్యలేదురోగినై చెరసాలలో ఉంటినిమీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారు ప్రభువామేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైననుదప్పిగొనియుండుటయైనను,పరదేశివై యుండుటయైననుదిగంబరివై యుండుటయైననురోగివై యుండుటను చూడలేదనిరి¸అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు."
        కాబట్టి మనము సాటి మనిషికి సాయం చేయడము చాలా మంచిది.
        ఈ భూమ్యాకాశాలను దేవుని వాక్కైన దైవకుమారుడు సృష్టించాడని తెలుసు కొన్నాము కదా! ఆయన సృష్టించినప్పుడు ఈ లోకములో పాపము లేదు. అయితే పాపము ఈ సృష్టి లోకి ఎలా వచ్చినదిఅసలు పాప మంటే ఏమిటి?
        దేవుడు మనిషిని ఒక మరమనిషిగా చేయలేదు. తనంతట తాను ఆలోచించి సొంత నిర్ణయము తీసుకొనే శక్తిని ఇచ్చాడుగాని ఒక్క మంచి చెడు అని తెలియజేసే శక్తిని మాత్రము ఇవ్వలేదు. కాబట్టి మొదటి మానవులలో పాపము అనేది లేదు ఎందుకంటే మంచేదో చెడేదో వారికి తెలియదుచిన్నపిల్లల మనస్తత్వముతో వుండేవారు. పాపము లేనందువలన వారికి మరణము కూడా లేదు. కాకపోతే మనిషి ఒక చెడిపోయిన దేవదూత ప్రోద్బలము వలన మంచి చెడు తెలియజేసే శక్తిని దేవుడు వద్దన్నప్పటికి అడిగినందువలన దేవుడు మంచి మరియు చెడు గురించి తెలిపే శాసనాలను మన హృదయములో ముద్రించాడు. ఈ శాసనాల వల్ల ప్రతి మనిషి కొంచెము ఆలోచిస్తే చెడేదో మంచేదో తెలుసుకోగలరు. మానవులు చపలమనస్కులని తెలిసినదేకదా! తప్పు చేసేవాడికి తను తప్పు చేస్తున్నానని తెలిసి చేయడమే పాపము. ఈ భూమిమీద ఏదో ఒక పాపము చేయనివారు ఎవరూ లేరన్నది వాస్తవము. దీనివలను మానవునికి మరణము ప్రాప్తించింది.
        మనమందరము పాపము చేసినవారమేఏదో ఒక రోజు చనిపోతాముదైవకుమారుని ముందు తీర్పుకు నిలబడ వలసిన వాళ్ళము. కాబట్టి మనము చనిపోకముందే మన పాపములను తొలగించుకోవాలి. ఎందుకంటే దైవకుమారుడు మన కోసరము క్రొత్త భూమిని సిద్దపరచే పనిలో వున్నారు. పాపములోనున్న వారికి దీనిలో ప్రవేశము లేదు. ఎలా మన పాపములను తొలగించుకొనగలముఅది దైవకుమారుని వల్లనే సాద్యము. ఎందుకంటే ఆయన మనకు పడవలసిన మరణ శిక్షను తన మీద వేసుకొని మనలను క్షమించమని తన తండ్రిని వేడుకొన్నాడు. కాబట్టి మనము మారు మనస్సు పొందిపశ్చాత్తాపపడి ఆ ధైవకుమారుడు ఇచ్చిన క్షమాబిక్షను అంగీకరిస్తే చాలుఆయన తన మరణశయ్య మీదనుంచి కారిన తన రక్తముతో మన పాపాలన్నియు కడిగివేస్తారు. మనలను తన తండ్రి అంగీకరించేలా మనలను తీర్చి దిద్దుతారు. ఇది ప్రపంచములో నున్న ప్రతి మానవునికి దైవకుమారుని ఉచితమైన పిలుపు. కులముమతముపేదగొప్ప అనే తేడా లేదు. ఎటువంటి పాపి అయినను మన్నింపును పొందవచ్చు. దైవకుమారుడు ఈ విధముగా మానవాళిని పిలుస్తున్నాడు "ప్రయాసపడి పాప భారము మోస్తున్న నా ప్రజలారా! నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతిని కలుగచేతును". కాబట్టి ఆయన మాట విని వచ్చిన వారికి పాప క్షమాపణ దొరుకుతుందివారి ఆత్మకు పట్టిన పాపమనే మలినము పోయి ఆత్మ తిరిగి తన పూర్వ సౌందర్యాన్ని పొందుతుంది. కాకపోతే ఒకటి మనము కూడా చేయాలి అది "దేవుడు మనలను క్షమించినట్లు మనము కూడా ఒకరికి ఒకరు ఉచితముగానే క్షమించుకోవాలి"
        ఉచితముగా వస్తే పినాయిలు అయినా త్రాగుతామని అంటుంటారు కదా! అటువంటప్పుడు మనము ఈ ఉచితముగా ఇవ్వపడుతున్న పాప పరిష్కారము పొందుటకు ఎంత ఆతురత పడాలో మనము ఆలోచించవలసిన విషయము. ఎందుకంటే మరణము ఏరోజు వస్తుందో ఎవరికీ తెలియదు. పాప క్షమాపణ మరణించుటకు ముందే పొందాలిఎందుకంటే దేవకుమారుని పాప క్షమాపణ అనే యజ్ఞము మానవునిగా ఈ భూమి మీదే మరణశయ్య మీద పూర్తి చేసాడు. కాబట్టి మనము కూడా పాప క్షమాపణను ఈ భూమి మీదే పొందాలి.
        అందరి పాపాలు ఊరికే క్షమిస్తే మంచి వారికి చెడు చేసిన వారికి తేడా ఏమిటిఅందరు నూతన సృష్టిలో ఒకటేనామంచిగా జీవించుటలో ఏమీ ప్రయోజనము లేదాఅనే ప్రశ్న మనల్ని బాధించక మానదు. అందుకనే మనము మరికొన్ని విషయములు తెలుసుకొందాం:
        ఈ లోకములో పాపము చేయనివారు ఎవరన్నా వున్నారాఏదో ఒక పాపము చేయనివారు వుండరు,చిన్నదోపెద్దదో అబద్దము చెప్పనివారు వుండరు. అంటే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అవసరము. దేవకుమారుని అడిగిన వారందరికీ పాప క్షమాపణ దయచేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి పని చేసే వుంటారు. ఇవి వారితో వారి కిరీటాలుగా చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మ వాటిని తీసుకువెలుతుంది. దేవుడు వారు చేసిన ఈ మంచి పనులను బట్టి నూతన సృష్టిలో వారికి రావలసిన బహుమతులు ఇస్తారు.
        ఇదంతా బాగానే వుంది ఇంతకి క్షమాపణ అడగాలంటే ఈ దైవకుమారుడు ఎక్కడవుంటాడుఏ గుడికి వెళ్ళాలిఏ కొండను ఎక్కాలిఎవరిని అడగాలిఎలా ఆయనను కనుగొనాలి?
        దేవుడు మనలని సృష్టించినప్పుడు ఆయన మన హృదయంలో నివాసమేర్పరచుకున్నాడు. మన దేహమే దేవునికి ఆలయము. పాపము వలన మనకు దేవునికి మధ్య దూరము పెరిగినది. దైవకుమారుడు మన హృదయపు తలుపులు ఎపుడు తెరచదరా! అని వేచియున్నాడు. అయన నిజము. నిజాన్ని వెతికే వారికి ఆయన తప్పక దారి చూపుతారు. ఆయనే మనలని కనుగొంటాడు. ఆయన చెప్పిన మాటలు ఈ విధముగా వున్నాయి: "అడుగుడీ! మీకియ్యబడును. వెదకుడీ! మీకు దొరకునుతట్టుడీ! మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందునువెదకువానికి దొరకునుతట్టువానికి తీయ బడును".  కాబట్టి మనము ధైర్యముగా సత్యాన్వేషణకు సిద్దపడడమే మనము చేయవలసినది. మీరు నిజము తెలుసుకోడానికి భయపడకుండా ఇటువంటి చిన్న ప్రార్ధన చేసిన చాలు:
        "సమస్తమును సృష్టించిన ఓ దేవా దయచేసి నాకు నిజమును తెలియచేయండి. నేను నిజమైన దేవుడిని తెలుసుకొనగోరుచున్నాను,  నాకు మార్గము చూపండి మరియు నన్ను మీ సన్నిధికి నడిపించండి. నా హృదయమును మీకు అర్పిస్తున్నాను. నాయందు మీరు నివసించండి"

దేవుడు మీకు తప్పక దారి చూపెదరు.

ఇట్లు నీ ప్రియ మిత్రుడు



FaithScope.com